Sunday, 4 February 2018

అడవి దాచిన అందాలు (A Beauty of Forest)

హుమ్మ్ హుమ్మ్ మెల్లగా తలపైకి ఎత్తి ఎం రాయాలి ఎలా రాయాలి అని పెదవులు కొరుకుతూ అలొచనలని అంచనాలు దాటించా. మనం రాసేది మనకు ఇంకా మనగురించి తెలిసిన వాళ్ళకి అర్దమవుతుంది. కాని చదివే వాల్లందరికి అర్దం అవ్వాలి అంటే అందరు ఇష్టపడే దాని గురించి రాయలి. అలా కొన్ని పదాలు వెతకసాగగా అమ్మ,స్నేహం,ప్రేమ,ఒంటరితనం అంటూ నా మనసున మెదిలాయీ అమ్మ,స్నేహం,ప్రేమ ఈ మాటాలకు నేను అర్దబావాలు అంటే అర్దవంతమైన మాటలు నా కలం తో ఇప్పుడు పలుకగలనా? అయినా ఇ మాటలకు ఎన్ని పదాలు జతచేసి రాసినా ఇంకాస్థ మిగిలేఉంటుందేమొ. అని అనుకుంటుండగానే,వీటన్నిటిని దాటుకొని ఒక ఆలొచన నన్ను బాగా ఆకర్షించింది. ఆ ఆలొచనకి అక్షరరూపం దాల్చిన నాకు కనిపించినవి అడవి దాచిన అందాలు.


 మీరు ఎప్పుడొఓకప్పుడు అడవి లొపలకి వెల్లుంటారు మీరు సరిగా గమనంచి ఉండకపొవచ్చు కానీ, మీకు చాలా పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లమీదుండే చిన్ని చిన్ని పక్షులు మన ఉహకు కుడా అందని బాషలొ, వాటీ క్రొంగొత్త ఊసులతొ మనకు ఆహ్వనంపలుకుతుంటాయి.మనం నడకసాగిస్తూ ముందుకు కదిలినా అడవిలొ చెట్లు మాత్రం వరుసన కనువిందుచేస్తుంటాయి.
ఇంకాస్థ అనుకుంటు ముందుకు సాగిన నాకు తారసపడినది రెండు ఇరుకైన కొమ్మల నడుమ దాగిన తేనెపట్టు.తేనెపట్టుని చూసిన పిదప నాకు తట్టిన ఆలొచన పురుగులు అంత అందమైన ఎలా ఆ చొటును వెతికి దాచాయా అని అంటే వాటికి మనకంటే ముందే చెట్లు, వాటి అందాలగురించి ముందే తెలిసిందేమొ అనుకుంటు ఇంకాస్థ ముందుకు నడిచా.అలా సాగుతున్నా నాకు సెలయేల్ల సవ్వడితొ పక్షులు పొటి పడుతున్నట్టు రెండు కలగలిసిన ఎదొ ఒక కొత్త ద్వని నా చెవిని తాకింది.మునుపెన్నడు ఇది వినింది లేదు కదా అనుకుంటూ చెవిని పెద్దగా చేసి సెలయేల్లకు చేరువగా చేరా.ఆ సెలయేల్లను చూసిన వాల్లందరు వావ్ బ్యూటిఫుల్ అనకమానరు, ఆ సుందర దృష్యాన్ని నా కెమేరా కన్నుతొ బందించి అక్కడ్నుంచి కదిలా.

వర్ణాతితమైన చెట్ల నడుమ నల్లని రహదారి స్వాగతం పలుకుతుంటే, కిలొమీటర్ల దూరం దాటి మైళ్ళ వైపుగా సాగా.ఇన్ని రకరకాల చెట్లు ఇంకా సెలయేల్లు చుసిన నాకు ఒక్క జంతువు కుడా కనపడలేదు అనుకుంటుడగా అల్లంత దూరానా ఒక లేడి పిల్ల చెవులు పెద్దగా చెసుకొని కాస్త కొపంగా నా వైపే చూస్తుంది. దాన్నీ కొమ్ము కాస్తూ ప్రక్కనే ఓ లేడిల బృందమే ఉందనుకొండి. అవన్ని ఒక్కసారిగా తాము చేయగలిగిన విన్యాసాలని మాకొసం ప్రదర్షిస్తున్నట్టు అటు ఇటు పరిగెత్తసాగాయి.అక్కడ్నుంచి పేరు పలుకలేని మూగజివాలేన్నొ కనపడసాగాయి.ఇంకాస్థ ముందుకు అనుకుంటు వెలుతుండగా ఎత్తులొ ఉన్నా మాకు రెండు కొండల నడుమ తన గమ్యం ఇంకా కానరాలేదు అన్నంత ఆత్రుత తొ హొయలుపొతున్న ఏరు తారసపడింది.ఏరుని చూస్తూ ఎత్తు నుండి పల్లంకి దిగాం.పల్లంకి దిగి ప్రకృతిని ఆస్వాదిస్తు పదిమైళ్ళు నడిచిన పిదప నాకు ఒక విషయం బొదపడింది.ఏదైన ఒకవిషయం గురించి లొతుగా వెళ్తేగాని దాని గురించి పుర్తిగా తేలుసుకొలేము అని. నాలొ నేను అనుకుంటు చాలా దూరంసాగా అలా,

ఇంకాస్థ ఇంకాస్థ అనుకుంటు నడిచి నడిచి నేను,రాసి రాసి నా కలం అలసినవి కాని అడవి దాచిన అందాలని బయటపెట్టలేకపొయాం అనుకుంటూ ఇప్పటి దాకా నేను చూసిన ప్రకృతిని నేమరువేస్తు అక్కడినుండి వెనుదిరిగా.అడవిని వదిలేసి వస్తుండంగానే సుర్యుని వేడిమి నుండి భూదేవిని కాపాడిన అడవి తల్లి కొసం చల్లని వెన్నెల్లమ్మ రానే వచ్చేసింది. అందుకే అంటారేమొ మరి అడవికాచిన వెన్నేల అని.


   చివరిగా ఒక్క మాట..
            అడవిలొ ఉండే చెట్లనుండి మనం నేర్చుకొదగిన విషయం ఏమిటంటే మనిషికి మల్లే వాటికి కుల,మత,కల్ముష బేదాలుండవూ అన్నీ చెట్లు కలిసే ఉంటాయి. ఈ రొజుల్లొ అలా సరదాగా వీకేండ్ ట్రిప్ కి వెల్లివద్దాం అనుకుంటున్న వాల్లనీ ఇ అడవి దాచిన అందాలు ఆహ్వానిస్తున్నాయీ.

Wednesday, 26 April 2017

కలలు నిజంఅయితేకనులు కనగలిగిన కళ్ళ ముందే కదిలిన కల

ఇది...

మనసు చెప్పిందా కళ్ళకు ఈ కలను కనమని???

లేక

ఎదురుచూసిన కళ్ళకు తొచిందా కలై రావాలని???

ఈ మరలరాని మరచిపొని కల!!!

ఇది కలయా??? నిజమా???

ఇది కల అయితే నిజం చేయ్యి,నిజం అయితే కాలాన్నే ఆపేయ్యి.

ఊహల పల్లకిలొ గగనపు అంచువరకు తిసుకెల్లిన ఆ కల,కళ్ళుతెరచి చూస్తే కలగానే మిగిలిపొయే.

మరలా కనులు మూసి మనసును తెరువగనే ఆ కల అంతా ఒక్కసారిగా కనుల ఎదుటమెదిలే.

అరేరే... ఎమిటి ఇది,

వచ్చినా ఆ కాస్త కలలొ ఓదిగిన నిజం నిజంగానే నిజం అయేతే???

...........

ఎప్పటికి గగనపు అంచులొనే ఉంటానేమొ,

వద్దు వద్దు....

ఎందుకంటే ఆకాశంలొ రొజు వచ్చే చంద్రుడికన్నా పౌర్ణమి రొజు వచ్చే చంద్రుడు మాత్రమే అందరిని మెప్పిస్థాడేమొ.

Sunday, 3 July 2016

హ్యపి న్యుయర్

టైం రాత్రి 10:30 2016 డిసింబర్ 31

కొత్తసంవత్సరం ఇంకొ 35 నిమిషాల్లొ రూం మొత్తం  కొత్త  పెళ్ళికుతురిలా ముస్తాబ్ అయ్యింది.రూం లొకి అడుగు పెడుతూనే కళ్ళని కుడివైపునకు కదపగనే  ఘుమఘుమల తాకిడిని నా ముక్కు పసిగట్టేసింది.చాలా రొజుల  తరువాత మా ఫ్రెండ్స్ అందరం కలిసాం,నేనే కాస్త కవాలనే లేట్ గా వెల్లా, అందరితొ  పలకరింపులు అయ్యయి ఇక అందరం ఒకదగ్గర  ఉన్నాం అంటే ఆ గొల కి ఎవ్వరైన బయపడల్సిందే.  ఇంతలొ రేయ్  నీకు ఫొన్ అని రాజేష్ ఫొన్ ఇచ్చాడు,ఆ ఫొన్ తిసుకొని  మెల్లగా కాళ్ళు కదుపుతు  పైకి నాడిచా, ఎప్పుడు నేను చూసే సిటినే కానీ ఈ రొజు చాలా కొత్తగా,మునుపటి కంటే చాలా అందంగా కనిపించింది.

ఆబ్బా అసలు ఎంటి ఇది, వీడు ఇంతకి ఎంచెప్పాలి అనూకుంటున్నడ్రాబాబు అనుకుంటున్నరా, అయితే కొంచెం కాస్థ ఒపిగ్గా చుడండి కాదు కాదు చూస్తు వినండి.నా పేరు అనన్,మాది హైదరాబాద్.అమ్మ నాన్న ఓ రాకసి చెల్లి వీళ్ళే  నా ప్రపంచం.వీళ్ళ తరువాత నేను ఎక్కువగా ఇష్టపడేది నా ఫ్రెండ్స్ని.అందుకేనేమొ నాకొచ్చం ఫ్రెండ్స్ సర్కిల్ కుడా ఎక్కువే, అలా రొజులు కాళ్ళకింద చెక్రాలు వేసుకొని పరిగెడుతున్నాయి.

ఇంతలొ ఎవర్రా ఫొన్ గర్ల్ ఫ్రెండా అంటు రాజేష్ ఇంకా సుషంత్ పైకి వచ్చారు.కాసేపు మౌనం తరువాత నువ్వు లాస్ట్ టైం న్యుయర్ ఎవరితొ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నవ్ రా అని రాజెష్ సుషాంత్ ని అడిగిన ప్రశ్న ఒక్కసారిగా నన్ను నా లాస్ట్  న్యుయర్ దగ్గరికి తిసుకెల్లింది.అవును మీరు అనుకునేది నిజమే నేను లాస్ట్ టైం న్యుయర్ ఇక్కడ వీళ్ళతొ  చేసుకొలేదు.


టైం సాయంత్రం 5:30 2015 డిసంబర్ 29

అమ్మమ్మ వాల్ల దగ్గర్నుండి ఫొన్ తాతయ్య కు బాలేదు  కొంచెం సిరియస్ అని.ఇక అమ్మ కన్నిళ్ళకి అడ్డుకట్ట వెయ్యలేక నాన్ననన్ను చెల్లిని తొడుగా అమ్మతొ  వైజాగ్ వెళ్ళమన్నాడు,మా చెల్లి ఏమొ నాకు కాలేజ్ లొ పని ఉంది అని చెప్పి తప్పించుకుంది రక్షసి అది అపద్దంచేప్తుంది అని తెలిసికుడా నాన్న ఏమి అనడు అందుకంటే అయనకు అదీ అంటే అంత ఇస్టం .ఇక నేను తప్పక తప్పించుకొలేక వైజగ్ కు కదిలా.
30  టైం 11:30 వైజాగ్  ఓ హస్పిటల్ లొ

తాతయ్య కు కంగరుపడల్సింది ఏమి లేది అని డాక్టర్  చెప్పగానే అమ్మ చాలా సంతొషంతొ నా వైపుకు చూసింది, అప్పుడు అమ్మని చూడగానే నాకుఇక ఈ న్యుయర్ ఇక్కడే అని అర్దం అయిపొయింది.

సాయంత్రం హరి వల్ల ఇంటికి వేల్లా. ఓ మీకు హరి ఎవరొ తెలియదు కదా ఇంతకముందు నేను వైజగ్ కు వచ్చినప్పుడు పరిచయం చేసుకున్న నా ఫ్రెండ్.అవును నేను ఇంతక  ముందు రేండు సార్లు వైజగ్ కు  వచ్చా ఒకటి చిన్నప్పుడు ఇంకొకటి పెద్దప్పుడు అదేనండి ఇంటర్ అయిపొయకా.అప్పుడు పరిచయం చెసుకున్న వాడే వీడు హరి.
ఎక్కడైతేనేం న్యుయర్ బాగా సేలబ్రట్ చేసుకొవలి అనుకున్నాం.అయితే హరి గాడు బీచ్ లొ ప్లాన్ చేద్దాం రా అన్నడు. నేను బీచ్ లొ అనే సరికి  విన్న వెను వెనువెంట్నే ఓకే చెప్పేసా.

టైం సాయంత్రం 9:30 2015 డిసంబర్ 31

బీచ్ అంతా ఫుల్ బందొబస్తు తొ నిండిపొయింది.న్యుయర్ రాత్రి  బీచ్లొకి ఎంట్రిలేదు.  మేము అంతా ఫుల్ బ్యగ్స్ తొ దిగిపొయాం.నేను హరి,ఇంకొ ఇద్దరు హరిఫ్రెండ్స్.అక్కడ ఒక కానిస్టేబుల్ నేనే మ్యనేజ్ చేసి (అంటే ఏమిలేదండి వాడికి ఒక 2000 ఇచ్చా అంతేబీచ్ లొపల్కి అయితే వచ్చేసాం చాలానే నడిపించారు లస్ట్ కైతే వచ్చేసాం, చొటు నేను మటల్లొ చేప్పలేను అది చుసిన నా కళ్ళకి మాత్రమే తెలుసు.అనన్ నువ్వు ఇవి అరేంజ్ చెయ్యి ఇప్పుడే వస్తాం అని కరుణ్ చెప్పాడు,అబ్బా అదేనండి మానలుగురిలొ ఒకడు హరిగాడిఫ్రెండ్.హరి నువ్వు రారా అన్నాడు కాని వాడికి అర్దం అయ్యింది నేను రావలనుకొవట్లేదు అని,నాకు అర్దం అయ్యింది వాల్లు వెల్లేది పొగపేట్టడానికి అని  లేదు మీరువెల్లండి అనిచెప్పా(అప్పుడు  రాత్రి బీచ్ లొ ఒక్కడినే ఉండిపొవాలనిపించింది  అందుకే  వాల్లని వెల్లమన్నా). మెల్లగాబ్యాగ్స్ లొంచి అన్నీ తెసేసా,మీరు ఎక్కువగా ఉహించుకొకండి కేక్ ఇంకా కూల్ డ్రింక్స్ (నిజం ఓట్టుగాకొన్ని చిప్స్ ప్యాకేట్స్.అన్ని సర్దేసా టైం  12:00 కావస్తుంది వీళ్ళు ఇంకా రాలదేంటి అనుకుంటు అటు వైపుకునడుస్తు వెల్లా.అక్కడ రాళ్ళ మద్య కాస్త వెలుగులు కనిపించాయివీళ్ళ పొగ ఇంకా అరలేదా అనుకుంటు అటుగా వెల్లా  అక్కడొ 8 మంది Girls 9 వ అమ్మాయి బర్తుడే సేలబ్రేట్ చేస్తున్నారు.నేను  పక్కనుంచి చుస్తూ నిల్చున్నా.అక్కడ 9 మందిలొ నా రెండు కళ్ళు మాత్రం   ఒక్క అమ్మాయినే చూస్తూ నాకాళ్ళు నిల్చున్నాయి.తను చాలా బాగానవ్వుతుంది.నిజంగా చేప్పాలంటే చాలాబాగుంది కుడా.

రేయ్ అనన్ రారా  టైం  అవుతుంది అని హరిగాడు పిలిచాడు.

టైం రాత్రి 12:00 2016 డిసింబర్ 31


హేయ్ గాయ్స్ హ్యపిన్యుయర్ హ్యపిన్యుయర్  వెల్కం టూ  2016 అంటు అందరు పైకి వచ్చేసారు.ఇక ఫొటొ లు ఫొన్ లొనే  హ్యపిన్యుయర్ లు అందరికి హ్యపిన్యుయర్ అనుకుంటు  మారూం స్ట్రీట్ అంతా తిరిగివచ్చే సరికి 4:00 అయ్యింది.ఇక మళ్ళి అందరు కొమాలొకి జారుకున్నారు.
నేను ఇంకా బీచ్ దగ్గరే ఉన్నాను.....

టైం సాయంత్రం 11:53 2015  డిసంబర్ 31
హరి గాడు పిలవగనే మెల్లగా నడుస్తు వెల్లా కాని నాకొ డౌట్ వచ్చింది.మేమే 2000 ఇచ్చీ లొపల్కి వచ్చాంకదా అసలు వీళ్ళు ఏలా వచ్చారా అని.అయినా అలాగొ వచ్చి చచ్చారులే అనుకొని మా స్పాట్ కి వేల్లిపొయా.మార్నిగ్ 5:00 వరకు అక్కడే ఉండి తరువాత వచ్చేసాం.

టైం సాయంత్రం 4:30 2015 జనవరి 1
హరి కాల్ చేసాడు మూవి కి వెల్దాం అని నేను ఒకే చేప్పా.ఇంకా చాలా టైం ఉంది   మూవి కి బీచ్ దగ్గరకు వెల్లి తరువత వెల్దాం అన్నాడు కరుణ్ గాడు సరే అనుకొని స్టార్ట్ అయ్యిబీచ్ కు వెల్లాంనాకు రాత్రి చూసినంత అందంగా బీచ్ కనిపించలేదు అందుకే షాపింగ్ చేయ్యలని మల్లి వాల్లని తెసుకొచ్చేసామాల్ మొత్తం తిరిగేసి వచ్చి నిల్చున్నాం.ఒక్కసారిగా నాకు రాత్రి చుసినా అమ్మయి కనిపించిందిఅలా చాలా సేపు  తన  షాపింగ్ వరకు ఇక్కడే ఉన్నాం నేను పైన  నుండి చుస్తునే ఉన్నా తను  షాపింగ్ కంప్లిట్ చేసుకొని వేళ్ళిపొయింది.


 మరుసటి రొజే నేను హైదరాబాద్ కు వచ్చేసా...........


టైం సాయంత్రం 5:10 2016 జనవరి 1
సాయంత్రం  మారాక్షసి ప్రాణం తీస్తుంటే ట్యంక్ బండ్ వరకు తీసుకొచ్చా  అదేమొ నన్ను వదిలేసి వాల్ల ఫ్రెండ్స్ తొ గల గల మట్లడుతునే ఉందినేనేమొ బుద్దున్ని చుస్తూ చాలా బుద్దిగా నిల్చున్నా.

ఇంతలొ హయ్ అనన్ అంటు నా దగ్గరకు నేను బీచ్ లొ చుసినా అమ్మయి........... 
నాకు మాటలురాలేదు తను మాత్రం నేను పరిచయం ఉన్నట్టు గానే మాట్లాడుతుంది.అలా కాసేపటి తరువాత  నా మొకం  లా ఉండే సరికి ఏంటి   అనన్ నేను గుర్తుకులేనా అని అదిగింది.నేను నిన్ను వైజగ్ లొ చూసా అనీ చేప్పాతను ఊం నేనే అంది.కాస్త నడుస్తు

మట్లడదామా  అనన్ అంది సరే అని కదిలాం,అనన్ మీకు నా పేరు తెలుసా అని అడిగింది నిజంగా చేప్పాలంటే నాకు మీ పేరు తేలియదండి అని చేప్పేసా(తను ఎమనుకున్నా పర్వాలేదు అని అనుకున్నా). తను నవ్వుతూ నీ పేరు అనన్ శివుడి కి ఇంకొ పేరు అయితే  నా పేరు పార్వతి కి ఇంకొక పేరు 26 లొ మిడిల్ నుండి స్టర్ట్ అవుతుంది చేప్పు అనన్ అంది.
(వీల్లు ఇక మరరా అనుకున్నా)

M.............

మాలిని అని వెంటనే చేప్పేసా (అంటే అది మా స్కుల్ లొ హింది టిచర్ పేరు అందుకని చేప్పేసా )యస్ అంది ఉపిరి పిల్చుకున్నా.

కస్త మౌనం తరువాత అప్పుడు అడిగా నేను అంటే మిమల్లని చుసా కానీ మీరు నన్ను ఎప్పుడు చూసారా అనీ నా డౌట్ అని.
అనన్ వైజగ్ లొ మీ అమ్మమ్మ వాల్ల ఇంటికి దగ్గర్లొనే మా ఇల్లు.నువ్వు బీచ్ లొ కానిస్టేబుల్  కి 2000rs ఇవ్వడం చూసే మేము వెల్లీ  కానిస్టేబుల్   తొనే మట్లాడి వచ్చాం లొపల్కికాని  500 rs....

ఇంకా ఆరొజూ మాల్ లొ కుడా చుసా మాట్లదాం అనుకున్నా కాని మీ ఫ్రెండ్స్ ఉన్నరూ అని రాలేదు అనిచేప్పింది. 

తను మాత్రం నవ్వుతునే ఉందినేను........షాక్..............
ఇంతలొ మా రాకాసి రే అనన్ అనుకుంటు వచ్చింది.

హయ్ మాలిని నువ్వేటి ఇక్కడ అంది ఒక్కసరే..... ఇంకా మలిని షాక్ నుండి తేలుకొని నాకు ఇది ఇంకొ షాక్ ఇచ్చింది.
ఒసేయ్ నీకు తను ముందే తెలుసా అని అడిగా రకసిని  అవును అంది..

తను మాత్రం ఇంకా నవ్వటం ఆపలేదు...
అప్పుడు ఇద్దరు నవ్వటం అయిపొయకా తను చేప్పింది.

మా అమ్మ ఇంకా వాల్ల అమ్మ మంచి ఫ్రెండ్స్ అని.అప్పుడు వైజగ్ లొ ఆరొజు కుడ మీ అమ్మ మా   ఇంటికి  వచ్చింది అంది .

మరి మీ ఇద్దరికీ ఎలా పరిచయం అని అడగనే మా రకసి తను మన ఇంటికి  సార్లు వచ్చింది రా నువ్వూ ఎప్పుడైనా ఇంట్లొ ఉండిచస్థే గా తేలిసేది అంది నవ్వుకుంటు....

(అయినా  కాలం అమ్మయిలు అబ్బయిల అలొచనలకు అందటంలేదు లే అనుకుంటు కదిలాం)........................
 పరిచయనికి అప్పుడే పేరు పెట్టలేను....మొత్తనికి , నాకుఇ న్యుయర్ చాలా కొత్తగా ఇంకొచం గమ్మత్తుగా హ్యపి గా మొదలైంది...