Sunday 4 February 2018

అడవి దాచిన అందాలు (A Beauty of Forest)

హుమ్మ్ హుమ్మ్ మెల్లగా తలపైకి ఎత్తి ఎం రాయాలి ఎలా రాయాలి అని పెదవులు కొరుకుతూ అలొచనలని అంచనాలు దాటించా. మనం రాసేది మనకు ఇంకా మనగురించి తెలిసిన వాళ్ళకి అర్దమవుతుంది. కాని చదివే వాల్లందరికి అర్దం అవ్వాలి అంటే అందరు ఇష్టపడే దాని గురించి రాయలి. అలా కొన్ని పదాలు వెతకసాగగా అమ్మ,స్నేహం,ప్రేమ,ఒంటరితనం అంటూ నా మనసున మెదిలాయీ అమ్మ,స్నేహం,ప్రేమ ఈ మాటాలకు నేను అర్దబావాలు అంటే అర్దవంతమైన మాటలు నా కలం తో ఇప్పుడు పలుకగలనా? అయినా ఇ మాటలకు ఎన్ని పదాలు జతచేసి రాసినా ఇంకాస్థ మిగిలేఉంటుందేమొ. అని అనుకుంటుండగానే,వీటన్నిటిని దాటుకొని ఒక ఆలొచన నన్ను బాగా ఆకర్షించింది. ఆ ఆలొచనకి అక్షరరూపం దాల్చిన నాకు కనిపించినవి అడవి దాచిన అందాలు.


 మీరు ఎప్పుడొఓకప్పుడు అడవి లొపలకి వెల్లుంటారు మీరు సరిగా గమనంచి ఉండకపొవచ్చు కానీ, మీకు చాలా పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లమీదుండే చిన్ని చిన్ని పక్షులు మన ఉహకు కుడా అందని బాషలొ, వాటీ క్రొంగొత్త ఊసులతొ మనకు ఆహ్వనంపలుకుతుంటాయి.మనం నడకసాగిస్తూ ముందుకు కదిలినా అడవిలొ చెట్లు మాత్రం వరుసన కనువిందుచేస్తుంటాయి.
ఇంకాస్థ అనుకుంటు ముందుకు సాగిన నాకు తారసపడినది రెండు ఇరుకైన కొమ్మల నడుమ దాగిన తేనెపట్టు.తేనెపట్టుని చూసిన పిదప నాకు తట్టిన ఆలొచన పురుగులు అంత అందమైన ఎలా ఆ చొటును వెతికి దాచాయా అని అంటే వాటికి మనకంటే ముందే చెట్లు, వాటి అందాలగురించి ముందే తెలిసిందేమొ అనుకుంటు ఇంకాస్థ ముందుకు నడిచా.అలా సాగుతున్నా నాకు సెలయేల్ల సవ్వడితొ పక్షులు పొటి పడుతున్నట్టు రెండు కలగలిసిన ఎదొ ఒక కొత్త ద్వని నా చెవిని తాకింది.మునుపెన్నడు ఇది వినింది లేదు కదా అనుకుంటూ చెవిని పెద్దగా చేసి సెలయేల్లకు చేరువగా చేరా.ఆ సెలయేల్లను చూసిన వాల్లందరు వావ్ బ్యూటిఫుల్ అనకమానరు, ఆ సుందర దృష్యాన్ని నా కెమేరా కన్నుతొ బందించి అక్కడ్నుంచి కదిలా.

వర్ణాతితమైన చెట్ల నడుమ నల్లని రహదారి స్వాగతం పలుకుతుంటే, కిలొమీటర్ల దూరం దాటి మైళ్ళ వైపుగా సాగా.ఇన్ని రకరకాల చెట్లు ఇంకా సెలయేల్లు చుసిన నాకు ఒక్క జంతువు కుడా కనపడలేదు అనుకుంటుడగా అల్లంత దూరానా ఒక లేడి పిల్ల చెవులు పెద్దగా చెసుకొని కాస్త కొపంగా నా వైపే చూస్తుంది. దాన్నీ కొమ్ము కాస్తూ ప్రక్కనే ఓ లేడిల బృందమే ఉందనుకొండి. అవన్ని ఒక్కసారిగా తాము చేయగలిగిన విన్యాసాలని మాకొసం ప్రదర్షిస్తున్నట్టు అటు ఇటు పరిగెత్తసాగాయి.అక్కడ్నుంచి పేరు పలుకలేని మూగజివాలేన్నొ కనపడసాగాయి.ఇంకాస్థ ముందుకు అనుకుంటు వెలుతుండగా ఎత్తులొ ఉన్నా మాకు రెండు కొండల నడుమ తన గమ్యం ఇంకా కానరాలేదు అన్నంత ఆత్రుత తొ హొయలుపొతున్న ఏరు తారసపడింది.ఏరుని చూస్తూ ఎత్తు నుండి పల్లంకి దిగాం.పల్లంకి దిగి ప్రకృతిని ఆస్వాదిస్తు పదిమైళ్ళు నడిచిన పిదప నాకు ఒక విషయం బొదపడింది.ఏదైన ఒకవిషయం గురించి లొతుగా వెళ్తేగాని దాని గురించి పుర్తిగా తేలుసుకొలేము అని. నాలొ నేను అనుకుంటు చాలా దూరంసాగా అలా,

ఇంకాస్థ ఇంకాస్థ అనుకుంటు నడిచి నడిచి నేను,రాసి రాసి నా కలం అలసినవి కాని అడవి దాచిన అందాలని బయటపెట్టలేకపొయాం అనుకుంటూ ఇప్పటి దాకా నేను చూసిన ప్రకృతిని నేమరువేస్తు అక్కడినుండి వెనుదిరిగా.అడవిని వదిలేసి వస్తుండంగానే సుర్యుని వేడిమి నుండి భూదేవిని కాపాడిన అడవి తల్లి కొసం చల్లని వెన్నెల్లమ్మ రానే వచ్చేసింది. అందుకే అంటారేమొ మరి అడవికాచిన వెన్నేల అని.


   చివరిగా ఒక్క మాట..
            అడవిలొ ఉండే చెట్లనుండి మనం నేర్చుకొదగిన విషయం ఏమిటంటే మనిషికి మల్లే వాటికి కుల,మత,కల్ముష బేదాలుండవూ అన్నీ చెట్లు కలిసే ఉంటాయి. ఈ రొజుల్లొ అలా సరదాగా వీకేండ్ ట్రిప్ కి వెల్లివద్దాం అనుకుంటున్న వాల్లనీ ఇ అడవి దాచిన అందాలు ఆహ్వానిస్తున్నాయీ.